ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకోగలమా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు చిరంజీవి. ఒక సామాన్యుడు హీరో అయితే ఎలా ఉంటుందో ఆయన ప్రూవ్ చేశారు. ప్రస్తుతం వయసు మీద పడినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు చిరంజీవి. టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో భారీ గా రూపొందుతున్నా మూవీ విశ్వంభర.


ఈ సినిమాపై ఇప్పటికే మెగాస్టార్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో 1506వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగారు పొందుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అప్డేట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తజగందుతున్న సమాచారం ప్రకారం చిరు అలాగే యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నడుమ కొన్ని కీలక సన్నివేశాలని దర్శకుడు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఈ సీక్వెన్స్ సీన్ కీలకంగా మారుతుందని టాక్.


ఇక ఈ భారీ సినిమాని విజువల్ వండర్ లాగా రూపొందిస్తుండగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు కన్ఫామ్ చేశారు. ప్రజెంట్ వరుస ఫ్లాప్ లతో ఉన్న చిరు ఈ సినిమా తో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. భోళ శంకర్ వంటి డిజాస్టర్ల మధ్యలో ఉన్నాడు చిరంజీవి. విశ్వంభర సినిమా కనుక సూపర్ హిట్ అయితే చిరు కెరియర్ మరికొన్ని సంవత్సరాలు పెరుగు చూసుకో అవసరం లేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: