సినీ పరిశ్రమలో కొంతమంది హీరోల దగ్గరికి కొన్ని కథలు వెళ్లిన సమయంలో ఆ కథలో అద్భుతంగా ఉన్నాయి కచ్చితంగా విజయాలు సాధిస్తాయి అని తెలిసిన కూడా తమపై ఆ సినిమాలు వర్కౌట్ కావు అని వేరే వాళ్ళతో ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి అని ఆ సినిమాలను ఆ హీరోలతో తెరకెక్కించమని దర్శకులకు హీరోలు సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన దగ్గరకు వచ్చిన ఒక బ్లాక్ బాస్టర్ కథను తనపై కాకుండా మరో హీరో పై బాగుంటుంది అని చెప్పి పంపించాడు.

సినిమా తీరా చూస్తే మంచి విజయం కూడా అందుకుంది. ఆ సినిమా ఏది మహేష్ ఎందుకు అలా చెప్పాడు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హీరో గా సమంత హీరోయిన్గా 24 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మొదట ఈ మూవీ కథను ఈ దర్శకుడు మహేష్ బాబుకు వినిపించాడట. సినిమా కథ మొత్తం విన్న మహేష్ బాబు ఈ మూవీ కథ చాలా డిఫరెంట్ గా ఉంది. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. 

కానీ నాపై మీరు ఈ సినిమా తీసినట్లు అయితే పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు సూర్య అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ కథకు ఆయనే న్యాయం చేయగలడు అని అతని పేరు సూచించాడట. దానితో విక్రమ్ కూడా మహేష్ మాట తీయకుండా సూర్య కు ఈ మూవీ కథను వినిపించాడట. సూర్య కు ఈ మూవీ కథ నచ్చడం 24 అనే మూవీ తో రూపొంది విడుదల కాపడం , మంచి విజయం సాధించడం జరిగాయట. ఇలా మహేష్ తన దగ్గరకు వచ్చిన గొప్ప కథను మరో హీరో చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చి ఆ సినిమా విజయంలో మంచి పాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: