తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటి మణులలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

తెలుగు లో మంచి అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా విజయాలను అందుకుంది. ఇలా తెలుగు , తమిళ్ , హిందీ సినీ పరిశ్రమలలో ఫుల్ జోష్ ను చూపించిన ఈ బ్యూటీ కి ఈ మధ్య కాలంలో అనేక అపజయాలు వచ్చాయి. దానితో ఈమె క్రేజ్ కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం ఈమె సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే పూజా హెగ్డే గతంలో రంగస్థలం , ఎఫ్ 3 వంటి సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది.

ఈ రెండు సినిమాలలో ఈమె తన అద్భుతమైన అందాలతో , డ్యాన్స్ తో సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. ఇలా అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగించిన ఈ బ్యూటీకి వరుసగా ఫ్లాప్ లు వస్తూ ఉండటంతో ఐటమ్ సాంగ్ లలో కూడా తీసుకోవడానికి భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తున్న అనేక మంది సినీ లవర్స్ పూజా హెగ్డే గొప్ప అందగత్తె , అలాగే మంచి టాలెంట్ ఉన్న నటి కూడా ... ప్రస్తుతం ఆమెకు అపజయాలు రావడంతో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈమెకు గనక ఒక్క సాలిడ్ విజయం పడినట్లు అయితే మళ్లీ ఈమెకు అవకాశాలు క్యూ కడతాయి. అలాగే ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి రెడీ అవుతారు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: