తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలలో ఈ మధ్యకాలంలో చాలా తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి , శ్రీ లీలా మొదటి వరుసలో ఉంటారు. కృతి శెట్టి "ఉప్పెన" మూవీతో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా విడుదలకు కాకముందే ఈ మూవీ నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పాటల ద్వారానే ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు క్యూ కట్టాయి. ఈమె కూడా వరుసగా సినిమాలను ఓకే చేసుకుంటూ వెళ్ళిన వెళ్ళింది.

దానితో ఈమె ఉప్పెన మూవీ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు మంచి విజాయలను అందుకున్న ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈమె కొన్ని రోజుల క్రితం హీరోయిన్గా నటించిన మనమే సినిమా ఈమెకు మంచి విజయాన్ని తీసుకు వచ్చింది. మళ్ళీ ఈమెకు మనమే సినిమా విజయంతో అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి. ఇక కృతి శెట్టి లాగానే శ్రీ లీలా కూడా చాలా తక్కువ కాలంలోనే ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ లో ఈమె తన నటన కంటే కూడా డ్యాన్స్ , అందాలతో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక వీరిద్దరికి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మరి విరు కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడకపోతే వరస అపజాయలు దక్కే ఛాన్స్ ఉంటుంది. అలా వరసగా ఆపజాయలు వీరికి వచ్చినట్లయితే ఛాన్సులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: