టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. rrr చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా సంపాదించిన ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా అందరికీ సుపరిచితమే.. అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది.ఎప్పుడో ఒకసారి మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది. మీడియాకు దూరంగా ఉండే స్టార్ హీరోల భార్యలు లక్ష్మీ ప్రణతిధి మొదటి స్థానం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట తన భార్యకు ప్రిఫరెన్స్ ఇస్తానని ఆ తర్వాత క్రికెట్కు ఇస్తానంటూ ఎన్టీఆర్ తెలియజేశారు.


గతంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఒక సినిమా రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి ఇష్టమైన విషయాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది. ఈ జనరేషన్ లో గొప్ప నటుడుగా పేరుపొందిన వారిలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు అని.. ఈయన నటించిన పిల్ల జమిందార్ సినిమా అంటే తన భార్యకు చాలా ఇష్టం అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు.


ఆమె వల్ల తాను కూడా ఎన్నోసార్లు పిల్ల జమిందార్ చిత్రాన్ని చూడవలసి వచ్చింది అంటు ఎన్టీఆర్ తెలియజేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని ఎన్టీఆర్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి మాత్రం ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరిచింది. ఆ తర్వాత మహానటి చిత్రంతో తన స్టామినా చూపించిన డైరెక్టర్ ప్రస్తుతం కల్కి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు పొందారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ భార్యకు ఎన్టీఆర్ సినిమాల తరువాత నాని సినిమాని ఎక్కువ ఇష్టమని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: