త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా దేవర. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతోంది. కాగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఇదివరకే డైరెక్టర్ కొరటాల శివ అనౌన్స్ చేశాడు. ఇందులో భాగంగానే పార్ట్ వన్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా

 ఉంది. కాగా దేవర సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను భారీ స్థాయికి పెంచేస్తున్నారు. దానికి తోడు ఇటీవల ఫస్ట్ సింగిల్ సైతం విడుదల చేయగా సోషల్ మీడియాలో దుమ్ము లేపింది ఆ పాట. అయితే తాజాగా ఇప్పుడు సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషి అవుతున్నారు.  దేవర సెకెండ్ సింగిల్ జులై రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫియర్ సాంగ్ తో గాస్ బంప్స్ తెప్పించిన మూవీ టీమ్.. ఈసారి ఓ రొమాంటిక్ మెలోడీతో రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ కు అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్

 కంపోజ్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సాంగ్ ను విదేశాల్లో గోవాలో షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే సెకెండ్ సింగిల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి ఈ సినిమా కంటే ముందు నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: