Box Office: రెండవ వారం కూడా కల్కికి తిరుగులేదు?  

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది..కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాలు కలిపి మొత్తం రూ. 380 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 381 కోట్ల షేర్ రావాలి. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి ఏడో రోజు కూడా జనాల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 10 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది.


మిగిలిన అన్ని ఏరియాలూ కలుపుకుని మొత్తం రూ. 20 కోట్లు రాబట్టింది. ఈ సినిమా టోటల్ గా వారంలో రూ. 345 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 36 కోట్లు వసూళ్లు చేస్తే సరిపోతుంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ మూవీ ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో వారంలో కూడా కల్కి కి పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో లేదు అంటూ యూనిట్‌ సభ్యులు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ముందో వెనకో... కాస్త ఆలస్యంగానో థియేటర్లలోనే కల్కి ని చూడాలని ఫ్యాన్స్ మరియు సినీ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. అందుకే రాబోయే రెండు వారాల పాటు కల్కి బాక్సాఫీస్ సందడి కంటిన్యూ అవ్వడం ఖాయం. మొదటి వారంతో పోల్చితే వసూళ్లు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ మరీ దారుణంగా డ్రాప్ అవ్వడం మాత్రం జరగదని, కల్కి రెండో వారంలో రికార్డ్‌ స్థాయి షేర్ ను దక్కించుకోవడం ద్వారా సరికొత్త రికార్డ్‌ లను నెలకొల్పడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: