ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అమితాబచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనే దిశా పటాన్ని వంటి చాలామంది స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 AD చిత్రానికి విడుదలైన ప్రతి థియేటర్ లో ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. కల్కి బావుంది అన్నవారే కానీ.. కల్కిని విమర్శించిన వారు లేరు. అఫ్ కోర్స్.. కల్కిలోను కొన్ని మైనస్ లు ఉన్నప్పటికి.. ఓవరాల్ గా సినిమాకి అందరూ

 పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. కల్కి విడుదలైన ప్రతి ఏరియాలో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ తో కల్కి రికార్డ్ నెంబర్లు నమోదు చెయ్యడం పక్కా అనిపిస్తుంది. ఇక గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సినిమాతో 700 కోట్ల గ్రాఫ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. తాజాగా కల్కి సినిమా తో తన రికార్డ్ తానే తిరగ రాసుకున్నాడు. కాగా గ్లోబల్ లెవెల్ లో ఈ సినిమా రోజుకు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 600 కోట్ల గ్రాస్. దాటిన ఈ సినిమా  700 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించింది. మన

 భారతీయ సినీ చరిత్రలో కల్కి మూవీ ప్రభాస్ కెరీర్ లో 4వ రూ. 600 కోట్ల చిత్రం. గతంలో బాహుబలి, పార్ట్ -1, పార్ట్ 2 సినిమాలు రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన 'సలార్' మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదలైన వారం లోపే రూ. 650 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. తాజాగా రూ. 700 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మొత్తంగా ప్రభాస్ కెరీర్ రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో మరే హీరో కూడా రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా ప్రభాస్ రాబోయే సినిమాలతో ఈ రికార్డులను తిరగ రాయడం ఖాయం అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: