లోకనాయకుడు కమలహాసన్ వారసురాలిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇప్పటికే చాలామంది పెద్దపెద్ద స్టార్ హీరోలతో నటించిన శృతిహాసన్ ఇప్పటివరకు తన తండ్రి పేరును ఉపయోగించుకోలేదు. సాధారణంగా ఏ సెలబ్రిటీ వారసులు అయినా సరే తమ తల్లిదండ్రుల పేర్లను చెప్పుకుంటూ టాలీవుడ్ లో స్టార్డం సంపాదించుకుంటారు. కానీ శృతిహాసన్ మాత్రం అలా కాదు తన సొంత కష్టంతో ఇప్పటివరకు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది.

అయితే సినిమాల పరంగా తన కెరీర్ బాగానే ఉన్నప్పటికీ పర్సనల్ గా మాత్రం ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైంది. ఇటీవల ఆమె ప్రియుడు శాంతను తో కూడా బ్రేకప్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ విషయం పక్కన పెడితే.. శృతిహాసన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.  తనకి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మకి

 సంబంధించిన ప్రశ్న ఎదురయింది.. మీ పెళ్లి ఎప్పుడు, ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటారు, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ రకరకాలుగా అడిగిన ప్రశ్నలకు కాస్త సీరియస్‌ గానే శృతి హాసన్‌ ఈసారి సమాధానం ఇచ్చింది.  ఇది 2024... ఆడవారిని పెళ్లి గురించి అడగడం ఇప్పటికి అయినా మానేయండి. ఇలాంటి వెర్రి ప్రశ్నలు అడగడం వల్ల మీ సమయం వృధా అవడం తప్ప మరేం లేదు. కనుక మీరు ఇకపై అయినా మీ పనులపై దృష్టి పెట్టండి, మీ వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. ఇకపై అయినా శృతి పెళ్లి విషయమై ప్రశ్నలు రాకుంటా ఉంటాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: