గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఎంత బాధ పడుతున్నాడు టాలీవుడ్   యంగ్ హీరో నితిన్. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మారాయి.  ఈ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో తర్వాత  సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఒక క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ చేసాడు. వకీల్ సాబ్ ఫేం

 వేణు శ్రీరామ దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు అని సినిమా చేస్తున్నాడు నితిన్. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదల చేశారు చిత్ర బృందం .అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ ఒక హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే తనకి భీష్మ వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడితో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలవుండగా ఇప్పుడు నితిన్ మరో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు

 ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి, తనకు హిట్ ట్రాక్ ఎక్కించిన ఇష్క్ మూవీ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ తో వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో సినిమా ఉన్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మరోసారి చర్చ నడుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే సినిమాను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి.. విక్రమ్, నితిన్ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: