సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత భారీ ఫ్యాన్ బేస్ కలిగిన హీరో ఆయన సంగతి మనందరికీ తెలిసిందే. నెగిటివ్ టాక్ తో కూడా మహేష్ సినిమాలు వందల కోట్లు కలెక్షన్స్ రాబడతాయి. అయినా రేంజ్ అలాంటిది మరి. మహేష్ కు ఉన్న యాక్షన్ అండ్ డైలాగ్ డెలివరీ, లుక్స్ కి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటెన్స్ తో కూడిన డైలాగ్స్ చెప్పినప్పుడు ఆడియన్స్ కి గూస్బంస్ రావాల్సిందే. మహేష్ కామెడీ టైమింగ్ కూడా అదుర్స్. చాలా సహజంగా మహేష్ డైలాగ్స్ ఉంటాయి.


నిజానికి చెప్పుకోవాలంటే తండ్రి కృష్ణ వాయిస్ కి మహేష్ వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది. మీరు చేసినా కొన్ని చిత్రాల్లో వాయిస్ ఆయనది కాదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిర్మొహమాటంగా నిజం. మహేష్ బాబు డబ్బింగ్ ఆర్టిస్ట్ సహాయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయట. షాకింగ్ మేటర్ ఏమిటంటే ఒక సినిమా మొత్తానికి ఆయన డబ్బింగ్ చెప్పలేదు. ఓ కామెడీ మహేష్ బాబు వాయిస్ అరవించాడు. ఆ సినిమాలో మహేష్ బాబుకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఒక జబర్దస్త్ కమెడియన్. అతడే బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్లో బులెట్ భాస్కర్ మిమిక్రీ చేస్తూ ఉంటారు.


ముఖ్యంగా ఆయన మహేష్ వాయిస్ మిమిక్రీ ఈజీగా చేస్తారు. ఆయన మాట్లాడుతుంటే మహేష్ బాబు మాట్లాడినట్లే ఉంటుంది. 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే చిత్రం మొత్తానికి బుల్లెట్ భాస్కర్ మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని బుల్లెట్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అదేవిధంగా మహేష్ బాబు నటించిన కొన్ని యాడ్స్ కి కూడా బులెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పారట. ఇది ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఏదేమైనాప్పటికీ ఇలా మహేష్ సినిమాలకి వేరే ఒకరితో డబ్బింగ్ చెప్పించి ప్రేక్షకులను బురిడీ కొట్టించారని చెప్పుకోవచ్చు.!

మరింత సమాచారం తెలుసుకోండి: