సాధారణ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి. అయినా గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవచ్చు. నటన, డాన్స్, సమాజ సేవ ఇలా అనేక అంశాలు ఆయనలో ఉన్నాయి. మెగాస్టార్ గా రియల్ హీరోగా నిలిచాడు చిరు. అంతేకాదు ఇండస్ట్రీలో తన చట్టాన్ని చాటుతున్నాడు. టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఎదిగారు. చిరంజీవి నీడ నుంచే టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టారు. ఇక అందులో ఇద్దరు హీరోలు పాన్ ఇండియాను శాసిస్తున్నారు కూడా.


నలుగురు స్టార్ హీరోలు కొనసాగుతున్నారు. సినిమా నిర్మాణంతో పాటు ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికీ తెలిసిందే. సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయంకృషితో టాలీవుడ్ లో ఈ స్థాయిని నెలకొల్పుకున్నాడు చిరంజీవి. నటన డాన్స్ తో పాటు టాలీవుడ్ లో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక నటనతో పాటు సోషల్ సర్వీసెస్ లో కూడా చిరు ముందుంటారు. కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియకూడదు అని ఫార్ములాని చిరంజీవి ఫాలో అవుతూ ఉంటారు. రీసెంట్గా పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.


70 ఏళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు చిరు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి టెన్త్ క్లాసులో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడనే విషయం ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఆయన టెన్త్ లో ఏ ర్యాంక్ సాధించారు అనేది చూస్తే షాక్ అవుతారు. తాజాగా వైరల్ అవుతున్న సర్టిఫికెట్ లో చిరంజీవి పేరు కె ఎస్ ఎస్ వరప్రసాద్ రావు అని తండ్రి పేరు వెంకట్రావు అని ఉంది. చిరు పెనుకొండ లో పుట్టినట్లు అందులో ఉంది. అయితే మెగాస్టార్కు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రం కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: