దేశంలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన ప్రేమికుడు , జెంటిల్మెన్  , భారతీయుడు , ఒకే ఒక్కడు , జీన్స్ బాయ్స్ ,  అపరిచితుడు , రోబో , శివాజీ , స్నేహితుడు ,  ఐ , రోబో 2.O లాంటి భారీ విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం ఇండియాలోనే గొప్ప గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే శంకర్ కొంతకాలం క్రితం ఇండియన్ 2 అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కొత్త భాగం పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దానితో శంకర్ కొంత కాలం వెయిట్ చేసి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ మొదలు పెట్టాడు. ఈ మూవీ మొదలు పెట్టి కొంత భాగం షూటింగ్ పూర్తి కాగానే మళ్ళీ ఇండియన్ 2 మూవీ తిరిగి ప్రారంభం అయింది. దీనితో శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మరో వైపు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ను తెరకెక్కిస్తూ వచ్చాడు.

ఇప్పటికే ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం శంకర్ వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటున్నాడు. ఇక శంకర్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కడ గేమ్ చెంజర్ మూవీ టాపిక్ వస్తుంది. ఇకపోతే మొదట్లో కొన్ని ఇంటర్వ్యూ లలో గేమ్ చేంజర్ మూవీ గురించి కొన్ని విషయాలను చెప్పిన శంకర్ ఆ తర్వాత మాత్రం ఆ సినిమా గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఎవరైనా ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన వాటిని సైడ్ చేస్తున్నాడు. అలాగే ఈ మూవీ విడుదల గురించి కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇలా గేమ్ చేంజర్ మూవీ గురించి శంకర్ పెద్దగా రెస్పాండ్ కాకపోవడంతో రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: