సినిమా పరిశ్రమలో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. కొంత మంది కి భారీ విజయాలు దక్కితే కానీ భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కవు. మరి కొంత మంది కి మంచి విజయాలు ఉన్నా కూడా క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కవు. మామూలు సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం నటించిన సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను ఎదుర్కొన్న వారికి క్రేజీ అవకాశాలు దక్కుతూనే ఉంటాయి. అలాంటి ఇద్దరు ముద్దు గుమ్మ లలో కావ్య దాపర్ , సాక్షి వైద్య ఉన్నారు.

కావ్య ఇప్పటి వరకు అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అందులో ఏక్ మినీ కథ ఒకటే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈమెకు వరుసగా ఫ్లాప్ లు వస్తున్న అవకాశాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం మూవీ లోను ,  రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ లోను హీరోయిన్గా నటిస్తోంది.

ఈ రెండు మూవీ లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో వరుస అపజయాలు వస్తున్న మంచి సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో సాక్షి వైద్య ఒకరు. ఈ బ్యూటీ అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయినప్పటికీ తెలుగు సినిమాలలో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకి మాత్రం హిట్ ,   ఫ్లాప్ లతో సంబంధం లేకుండా క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: