దేవర' సెకెండ్ సింగిల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. జులై రెండో వారంలో సెకెండ్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫియర్ సాంగ్ తో గాస్ బంప్స్ తెప్పించిన మూవీ టీమ్.. ఈసారి ఓ రొమాంటిక్ మెలోడీతో రానున్నట్లు సమాచారం.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ‘దేవర’ రెండు పార్టులుగా విడుదల కానుంది. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘దేవర’ ఫియర్ సాంగ్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. సెకెండ్ సింగిల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. దేవర సెకెండ్ సింగిల్ జులై రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫియర్ సాంగ్ తో గాస్ బంప్స్ తెప్పించిన మూవీ టీమ్.. ఈసారి ఓ రొమాంటిక్ మెలోడీతో రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ కు అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు చెబుతున్నారు. 

ఈ సాంగ్ ను విదేశాల్లో గోవాలో షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే సెకెండ్ సింగిల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి రూపొందిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ మూపీకి సంగీతం అందిస్తున్నారు.దేవర సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ చాలా నమ్మకంతో ఉన్నారు. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే చెప్పారు. గ్లింప్స్, పాట కూడా అదిరిపోవటంతో ఈ చిత్రంపై క్రేజ్ పెరుగూనే వస్తోంది. భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: