న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న రెండవ సినిమా 'సరిపోదా శనివారం'. మొదట వీరి కాంబినేషన్ లో వచ్చిన అంటే.. సుందరానికి.. ప్లాప్ అయింది.ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో నాని పోషిస్తున్న సూర్య పాత్ర శనివారాల్లో ప్రత్యేకంగా ఉంటుంది అని టీజర్ లో చూపించారు.ఆ టీజర్ లో నాని చాలా కోపంగా కనిపించారు. ఈ మూవీలో గతంలో ఎప్పుడు లేనంత సరికొత్త గెటప్ లో నాని కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. సూర్య క్యారెక్టర్ లో మరో షెడ్ ను చూపిస్తూ రెండవ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో నాని ఎంతో న్యాచురల్ గా కనిపించే ఒక యువకుని పాత్రలో కనిపిస్తున్నారు. ఇందులో ఒక బైక్ పై ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.ఇది నానికి ఉన్న ప్రత్యేకత, ఆయన క్లాస్ ఇంకా మాస్ క్యారెక్టర్స్ ను సమానంగా మెప్పిస్తారుని అని చెప్పవచ్చు. నాని పాత్రలో రెండు విభిన్నతలు కనిపిస్తున్నాయి. ఈ మూవీలో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది. 


DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఎస్‌జే సూర్య విలన్‌గా ఇంకా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా ఈ సినిమాలో కనిపించనున్నారు.టీజర్ తోనే మూవీ టీం మంచి హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాకు పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది.అలాగే నిర్మాతకు నాన్ థియేట్రికల్ గా మంచి డీల్స్ సెట్ అయ్యాయి. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. ఇక సరిపోదా శనివారం మూవీలో నాని పాత్ర విభిన్న క్షణాల్లో ఏ విధంగా ఉంటుందో చూడలనే ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. సూర్య పాత్రలోని విభిన్నతలు చూపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


మూవీ టీజర్ విడుదల చేసినప్పటి నుండి సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది. నాని ఇలాంటి విభిన్న పాత్రలను పోషించడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండే నటుడు. ఈ మూవీలో కూడా ఆయన తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను ఆగస్టు 29న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు నాని మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: