నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోన్న ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.ఈ చిత్రం నుండి హోప్ ఆఫ్ శంబాల అనే సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. సినిమాలో ఎంతో కీలకం అయిన ఈ సాంగ్ ను రిలీజ్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.సినిమాకు వస్తున్న స్పందనను చూసి డిస్ట్రిబ్యూటర్లు నార్తిండియాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని స్క్రీన్స్‌ను యాడ్‌ చేశారు. ఈ రెస్సాన్స్ ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లు కూడా చేరిపోవచ్చిన ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

వైజయంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని మూవీ లవర్స్‌ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ఈ తరంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ అంటూ ప్రభాస్ ఫొటోను పోస్ట్ చేసి ఇటీవలే పోస్ట్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ వల్లే ఈ స్థాయిలో భారీ కలెక్షన్లు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తాను ఈ చిత్రం ఇంత బాగా తీసుకొచ్చేందుకు ప్రొడక్షన్‍కు ప్రభాస్ ఆత్మవిశ్వాసం ఇచ్చారని, ఏం చేయాలో చేసేందుకు తమకు స్వేచ్ఛ ఇచ్చారని నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రభాస్ ఇచ్చిన చాలా సలహాలు ఈ మూవీకి ఎంతో ఉపయోగపడ్డాయని నాగీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: