రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.


సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జపాన్ అంతటా మూవీ ట్విన్ 2 థియేటర్లలో విడుదల చేస్తుంది. తాజగా సలార్ మూవీ మేకర్స్ ఈ ఎపిక్ యాక్షన్ సాగా యొక్క జపనీస్ వెర్షన్ జూలై 5, 2024న తెరపైకి రానున్నట్లు ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి ఇంకా బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: