రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ టాక్ రావడంతో ఈ మూవీ కి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. మొదటి వారం రోజుల బాక్స్ ఆఫీస్ కంప్లీట్ రన్ పూర్తి అయ్యే సరికి కల్కి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 135.32 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

మొదటి వారంలో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో కల్కి ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం. కొంతకాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి వారం రోజులు పూర్తి అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 187.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక ఈ మూవీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను మొదటి వారం వసూలు చేసిన సినిమాల లిస్టులో కల్కి నిలిచింది. కల్కి 135.32 కోట్ల షేర్ కలక్షన్ లను మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... దిశ పటానీ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ మరో వారం రోజులు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: