ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్  శోభన , మృణాల్ ఠాకూర్ , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న పాత్రలలో నటించారు. కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 7 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 67.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 15.52 కోట్లు , ఉత్తరాంధ్రలో 15.58 కోట్లు ,  ఈస్టు లో 9.22 కోట్లు ,  వెస్ట్ లో  6.82 కోట్లు ,  గుంటూరు లో 8.48 కోట్లు ,  కృష్ణ లో 8.29 కోట్లు ,  నెల్లూరు లో 4.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 135.32 కోట్ల షేర్ ... 210.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 22.45 కోట్లు , తమిళ నాడు లో 13.75 కోట్లు , కేరళలో 7.25 కోట్లు ,  హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 79.60 కోట్లు , ఓవర్ సీస్ లో 85.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో 343.92 కోట్ల షేర్ ... 660.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 28.08 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: