నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో అఘోరాగాను , మరొక పాత్రలో రైతుగాను నటించిన బాలకృష్ణ రెండు పాత్రలలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టి పాడేశాడు. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజులకే ఈ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతుంది అని ఈ మూవీ బృందం వారు చెప్పుకొచ్చారు.

ఇక కొన్ని రోజుల క్రితమే బోయపాటి కూడా అఖండ 2 కి సంబంధించిన కథ మొత్తం రెడీ అయింది అని తెలియజేశాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ , బోయపాటి కాంబోలో నాలుగవ మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ పాత్రకు కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దానితో ఈమె అఖండ 2 లో ఉంటుందా ..? ఉండదా ..? అనే అనుమానాలు జనాల్లో రేకెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు , ఆమె పాత్ర అఖండ సినిమాకు కొనసాగింపుగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: