సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో మా ఊరి పొలిమేర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమా ఓ టి టి లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఈ మూవీ యొక్క మొదటి భాగానికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా రెండవ భాగాన్ని నేరుగా ఓ టీ టీ లో కాకుండా థియేటర్ లలో విడుదల చేశారు.

మూవీ కి థియేటర్ లలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను కూడా భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రచారం అయింది. ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ మా చానల్ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని బుల్లి తెరపై ప్రసారం చేయగా ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను కూడా భాగానే ఆకట్టుకుంది. మొదటి సారి ఈ మూవీ స్మాల్ స్క్రీన్ పై ప్రచారం అయినప్పుడు ఈ సినిమాకు స్టార్ మా చానల్లో 6.21 టి ఆర్ పి రేటింగ్ వచ్చింది. చిన్న సినిమా అయిన మొదటి సారి ప్రసారం అయినప్పుడు 6.20 టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంది అంటే అది గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో బాలాదిత్య , గెటప్ శ్రీను , చిత్రం శ్రీను , రవివర్మ , సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: