తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ గేమ్ షోలలో బిగ్ బాస్ ప్రధాన స్థానంలో ఉంటుంది. మొదట ఇండియాలో హిందీలో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత భారత దేశంలోనే చాలా భాషలలో ప్రసారం కావడం మొదలయ్యింది  అందులో భాగంగా తెలుగులో కూడా బిగ్ బాస్ మొదలు అయ్యి చాలా కాలమే అవుతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటి వరకు జరిగిన ఏడు బుల్లితెర సీజన్లకి అలాగే ఒక ఓ టి టి సీజన్ కి కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ బృందం ఈ సీజన్లోకి ఎవరిని తీసుకురావాలి అనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు , అందులో కొంత మంది ని ఇప్పటికే ఫైనల్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇక మొదటి షో.కు ఎన్టీఆర్ రెండవ షో కు నాని హోస్ట్ గా వ్యవహరించిన ఆ తర్వాత నుండి నాగార్జున వరుసగా బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరి ఎందుకు ఇంతలా నాగార్జున బిగ్ బాస్ ను వదిలి పెట్టడం లేదు అని అనుకుంటున్నారా. దానికి కారణం పెద్దగా ఏమీ లేదు. బిగ్ బాస్ ప్రసారం అవుతున్న ఏ భాషలో అయినా దాదాపుగా ఎక్కువ శాతం ఒకరే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మన తెలుగులో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించడంలో ఆరితేరిపోయాడు. అలాగే అవసరం ఉన్నప్పుడు కంటెస్టెంట్లను పొగడడం , తప్పు చేసినప్పుడు వాళ్ళ తాట తీయడం కూడా నాగార్జునకు బాగా తెలుసు. దానితో బిగ్ బాస్ బృందం నాగార్జునను వదిలి పెట్టకుండా బిగ్ బాస్ కు హోస్ట్ గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: