ఒకప్పుడు సౌత్ సినిమాలకు 100కోట్ల కలెక్షన్స్ పెద్దవిగా కనిపించేవి కానీ కాలం మారింది. రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సీరీస్ సినిమాలను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశాడో వాటికి హిట్ టాక్ రావడంతో ఆ మూవీలకు కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో చాలా మంది రాజమౌళి రూట్ ను ఫాలో కావడం మొదలు పెట్టారు. కథలో దమ్ముంటే ఖర్చు ఎక్కువైనా పర్లేదు దానిని కరెక్ట్ గా ప్రమోట్ చేసి చాలా భాషలలో విడుదల చేసినట్లు అయితే ఆ మూవీ ద్వారా డబ్బులను వెనక్కి తేవచ్చు భారీ లాభాలను పొందవచ్చు అని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

దానితో ప్రస్తుతం స్టార్ హీరోలపై పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దానితో ఖర్చు వందల కోట్లలో అయినా కూడా కరెక్ట్ గా సినిమా వర్కౌట్ అయితే 1000 కోట్లకు పైగా కూడా కలెక్షన్లను సాధించవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు 600 కోట్ల కలెక్షన్లను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా 600 కోట్ల కలెక్షన్లను సాధించిన సినిమాలు ఏవో తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి మొదటి భాగం , రెండవ భాగం రెండో కూడా 600 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి.

ఇక రెండవ భాగం కి మంచి హిట్ టాక్ రావడంతో రెండవ భాగంకు ఏకంగా వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీలతో పాటు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కూడా 600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక కన్నడ సినిమా అయినటువంటి కే జి ఎఫ్ చాప్టర్ 2 కి కూడా 600కు పైగా కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక తాజాగా ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తాజాగా 600 కోట్ల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇక కాస్త లెక్కలు అటు ఇటు అయినా కూడా మరో ఒకటి , అయినటువంటి రెండు సినిమాలు మాత్రమే సౌత్ నుండి 600 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: