తెలుగు అమ్మాయి అయినటువంటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ కెరియర్ ప్రారంభంలో ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలాంటి సమయంలోనే ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసి అక్కడ మంచి విజయాలను అందుకుంది. ఇక ఈమె నటించిన జర్నీ మూవీ తెలుగు లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక తెలుగు సక్సెస్ ఫుల్ మూవీలలో హీరోయిన్ గాను , ఇతర ముఖ్య పాత్రలలోను నటించింది.

ఇది ఇలా ఉంటే ఒకానొక సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న ఏ నటి అయినా వేశ్య పాత్రలో నటించడానికి చాలా భయపడుతూ ఉండేవారు. ఎందుకు అంటే వేశ్య పాత్ర ద్వారా ఒక గొప్ప నటనను ప్రేక్షకుల ముందు ఉంచవచ్చు కానీ , అలాంటి పాత్ర చేసినట్లు అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో .. ఆ తర్వాత మంచి పాత్రలు వస్తాయో రావో అనే భయంతో చాలా మంది నటి మనులు ఈ పాత్రలకు దూరంగా ఉండేవారు. కాలం మారింది. ఇప్పుడు నటీమణులు వైవిధ్యమైన పాత్రలలో నటించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం డిఫరెంట్ పాత్రలలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న నటి మణులతో అంజలి ఒకరు. కొన్ని రోజుల క్రితమే ఈమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. ఇందులో తన నటనతో అంజలి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ బహిష్కరణ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జీ 5 ఓటిటి లో జూలై 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సిరీస్ లో కూడా అంజలి వేశ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకానొక సమయంలో ఎంతో రిస్క్ అనుకున్న పాత్రలను అంజలి మాత్రం ఏరి కోరి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ తో అంజలి కి ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: