లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపాందుతుంది. ఇండియన్ సినిమా తెలుగులో భారతీయుడు పేరుతో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈ సినిమాను తెలుగులో భారతీయుడు 2 అనే పేరుతోనే విడుదల చేయనున్నారు.

ఇండియన్ 2 మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. దీనితో ప్రస్తుతం ఈ మూవీ బృందం ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. సెన్సార్ బృందం ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను కట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా మొదలు అయిన 21 నిమిషాల 46 సెకండ్ల తర్వాత బ్రైబ్ మార్కెట్ అనే పదం వస్తుందట. ఆ పదాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలను కూడా తొలగించినట్లు తెలుస్తోంది.

ఇక ఏదేమైనా ఈ సినిమా రన్ టైమ్ మాత్రం భారీగానే ఉండబోతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే ఈ మూవీ ఏకంగా 3 గంటల 4 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గతంలో శంకర్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలు ఇలా భారీ రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూవీ కూడా అలాంటి రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: