ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 8వ రోజు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం రూ. 5.50 కోట్లు షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా కూడా సత్తా చాటింది. వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్ రాబట్టి విజయానికి బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చేసింది. 380 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా వచ్చిన ఈ సినిమా ఇంకా కేవలం 17 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇప్పటిదాకా 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా. 


ఇక ఇదిలా ఉండగా కల్కి 2 స్టోరీ ఇదే అంటూ సోషల్‌ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కల్కిని మోస్తున్న తల్లి సుమతిని శంభాల నుంచి కర్ణుడు ఎత్తుకెళ్లడం.. అశ్వత్థామ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయింది. ఇక మొదటి భాగంలో చాలా పాత్రలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయ్. దుల్కర్ సల్మాన్ ఇంకా రాజేంద్రప్రసాద్‌, శోభన.. ఇలా కాసేపే స్క్రీన్ మీద కనిపించారు. అయితే ఈ పాత్రల బ్యాక్‌గ్రౌండ్‌ను పార్ట్‌ 2లో మరింత ఎలివేట్ చేయబోతున్నారట. పరుశురాముడి స్ఫూర్తితో దుల్కర్ సల్మాన్‌ పాత్రను నాగి అద్భుతంగా క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది.దీంతో దుల్కర్ సల్మాన్‌ పాత్ర ఇంకా హైలైట్‌గా ఉండబోతుందట. పార్ట్‌ 1కు బిగ్ హైలైట్‌.. కురుక్షేత్రం సీక్వెన్స్‌. అర్జునుడిలా విజయ్, అశ్వత్థామలా అమితాబ్‌, కర్ణుడిలా ప్రభాస్‌.. లుక్‌ అయితే అదిరిపోయింది. వీళ్ళు ఫస్ట్ పార్ట్‌లో కనిపించింది కాసేపైనా.. పూనకాలు తెప్పించేశారు. సెకండ్‌ పార్ట్‌లో కురుక్షేత్రం సీన్స్‌ మరింత హైలైట్ చేసే ఛాన్స్ ఉంది.ఇక కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదు. పార్ట్ 2లో కూడా అలానే కంటిన్యూ చేస్తారట. కల్కి సైన్యానికి అశ్వత్థామ సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. కల్కి తరఫున యుద్ధం చేసే సైనికులకు శిక్షణ ఇస్తాడు. ఐతే కల్కికి కర్ణుడికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. నాగ్అశ్విన్ కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు కనిపిస్తున్నాడు. కల్కిని కాపాడుతూ పుణ్యం తీసుకునే పాత్రలో కర్ణుడుగా ప్రభాస్ నటిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: