బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ అన్ని షేర్ షేర్ చేసుకుంటున్నారు. రీతూ చౌదరి - విష్ణు ప్రియా. ఎంతలా అంటే ఏకంగా ప్రియుడిని కూడా షేర్ చేసుకునేంతలా..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ సోషల్ మీడియా హాట్ బాంబ్స్ వారి లేటెస్ట్ కామెంట్స్ తో వీరి ఎఫైర్ బాగోతం బట్టబయలు అయ్యింది. విష్ణుప్రియ ఎక్స్ లవర్ తో రీతూ చౌదరి ఎఫైర్ పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.. విష్ణుప్రియ-రీతూ చౌదరి ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ ఎప్పుడు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. కలిసి పార్టీలు చేస్తారు.కలిసి విహారాలకు వెళతారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి కలిసి చిల్ అవుతున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి. ఇంస్టాగ్రామ్ లో వెకేషన్ ఫోటోలు షేర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒకరి మించి ఒకరు బోల్డ్ ఫోటో షూట్స్ తో కాకరేపుతూ ఉంటారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి స్కిన్ షోపై తరచుగా వారిపై ట్రోలింగ్ జరుగుతుంది. అయినా వీళ్ళు అవేమీ పట్టించుకోరు. ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గంగా మారిన తరుణంలో ఎంత తిట్టినా గ్లామర్ షో ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకోవాలనేది వారి గోల్.మ్యాటర్ ఏంటంటే రీతూ చౌదరి  ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారనే టాక్ ఉంది. ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ కాగా... రీతూ చౌదరి అతనితో దిగిన ఫోటోలు గతంలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అతడిని రీతూ చౌదరి పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత బ్రేకప్ చెప్పినట్లు పుకార్లు వినిపించాయి. 


అయితే కొద్దిరోజులకే రీతూ చౌదరి-శ్రీకాంత్ కలిసి కనిపించారు. ప్రస్తుతం రీతూ చౌదరి ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉందా? లేదా? అనేది అస్పష్టం. అయితే విష్ణుప్రియ మాజీ లవర్ తో రీతూ చౌదరి ఎఫైర్ నడుపుతున్నదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక శ్రీముఖి యాంకర్ గా ఉన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అనసూయ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పాల్గొన్నారు. ఈ షోలో కాలేజ్ థీమ్ తో స్కిట్స్ చేశారు. దీనిలో భాగంగా రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాసింది. దాన్ని అందరి ముందు చదివింది.నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక షాపింగ్ చేయడం మానేస్తా... ఎందుకంటే నీ బట్టలు నేను ధరించాలి. నీ కోసం చేసే కాఫీతోనే నా రోజు మొదలవ్వాలి... అని రీతూ చౌదరిలవ్ లెటర్ లో రాసింది. 'నీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా' అని విష్ణుప్రియ రీతూ చౌదరితో అంది. 'మా వాడికి కాఫీ అలవాటు లేదని నీకు ఎలా తెలుసు?' అని విష్ణుప్రియను రీతూ చౌదరి అడిగింది. ఎందుకంటే అతన్ని నీ కంటే ముందు నేను ప్రేమించాను కాబట్టి... అని బాంబు పేల్చింది. దాంతో షోలో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో కనిపించడంతో రేయ్ ఎవర్రా మీరంతా అని కామెంట్స్ చేస్తూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: