పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టిస్తోంది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన మహాభారతం ఇతివృత్తంతో ముందుగా సాగే కథ నేపథ్యంలో రూపొందింది. దాంతోపాటు అటు భవిష్యత్తులో ఎటువంటి మార్పులు వస్తాయి అన్నదాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్. జూన్ 27న

 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .అందులో భాగంగానే సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు కల్కి లోని పలు కీలక సన్నివేశాలు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి .అయితే దాదాపుగా మూడు గంటలపాటు ఉన్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. దానితో ఆ సన్నివేశాలు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని దగ్గరుండి డైరెక్ట్ చేసి విడుదల చేసిన

 డైరెక్టర్ కి మాత్రం ఇందులోని కొన్ని సన్నివేశాలు అంటే చాలా ఇష్టమట. మరి ఆ సన్నివేశాలు ఏంటి అన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. డైరెక్టర్ నాగ అశ్విన్‌కు ప్రత్యేకంగా రెండు సన్నివేశాలు ఎంతో ఇష్టమట. కల్కి మూవీలో తాను ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడిన తర్వాత కాంప్లెక్స్ నుంచి స్వరంగం గుండా దీపికా పదుకొణె తప్పించుకుంటుంది. ఇంటర్వెల్ మకి ముందు వచ్చే ఈ సన్నివేశం గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. టెక్నికల్‌గా, పర్ఫామెన్స్ పరంగా ఎంతో చాలెంజింగ్‌గా ఉన్న ఈ సన్నివేశం నాగ అశ్విన్‌కు ఎంతో ఇష్టమైన సన్నివేశమట.  తన చుట్టూ ఎగసిపడుతున్న మంటల మధ్య బిడ్డను కాపాడుకోవడానికి ధైర్యం చేసి ఓ తల్లి ముందడుగు వేసే సన్నివేశం ఇది. సాక్షాత్ భగవంతున్ని మోస్తున్న ఆ తల్లి కోసం అగ్ని కూడా దారి ఇస్తుంది.  అతనికి ఇష్టమైన మరొక సన్నివేశం అశ్వత్థామ.. భైరవ మధ్య జరిగే క్లైమాక్స్ యుద్ధమట. ఇద్దరు అగ్ర తారలు కలబడే ఆ సన్నివేశం మూవీకే హైలెట్ అనడంలో డౌట్ లేదు. మరి ముఖ్యంగా అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ణుడి విజయ ధనస్సు ప్రభాస్ చేతికి వచ్చే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. అలా ఈ రెండు సన్నివేశాలు అంటే నాగ్ అశ్విన్ కి చాలా ఇష్టమట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: