రేవ్ పార్టీ.. ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా కూడా ఇదే వినబడుతుంది. అంతేకాదు ఈ వ్యవహారం ఎన్ని అరాచకాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీ లో చాలామంది నటీనటులు ఉన్నట్లుగా తెలిపారు. ఇక అందులో నటి హేమ కూడా ఉంది అంటూ టాలీవుడ్ లో ఎంతటి చర్చ జరిగిందో మనందరికీ తెలిసిందే. అంతే కాదు నటి హేమను అరెస్ట్ చేయడమే కాకుండా కొన్నాళ్లపాటు జైల్లో కూడా పెట్టారు. అయితే తాజాగా ఇప్పుడు మరో స్టార్ యాంకర్ రేవ్ పార్టీలో దొరికినట్లు గా

 తెలుస్తోంది. ఇక ఆ స్టార్ యాంకర్ మరెవరో కాదు రోహిణి. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటి పలు షోలకి యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది. అలాగే పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తోంది. ఇక ఈమె చేసే కామెడీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలవుండగా   తాజాగా హేమ రేవ్ పార్టీ వీడియోని పోలినట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది నిజమైన రేవ్ పార్టీ వీడియో కాదు ఏదో ప్రమోషనల్ వీడియో లాగా కనిపిస్తోంది.

 ఏదో సినిమాకి రోహిణి ప్రమోషన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను వెంటాడుతున్న మీడియా ప్రతినిధుల మైక్ మీద అసలు లేని చానల్ సింబల్ కనిపిస్తోంది. అయితే ఇది బర్త్డే బాయ్ సినిమా ప్రమోషన్స్ అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. నాకేం సంబంధం లేదు సార్, బర్త్డే పార్టీ ఉందని చెబితే వచ్చాను అంటూ ఆమె చెబుతుండగా నీకు పాజిటివ్ వచ్చింది అంట కదా అని ఒక మీడియా ప్రతినిధి అడుగుతున్నట్టు కనిపిస్తుంది. దానికి ఆమె నాకు అసలు టెస్ట్లే చేయలేదు ఎలా పాజిటివ్ వస్తుందని అనడంతో పాటు ఈ ఎన్నారైలు బర్త్డే పార్టీ అని పిలిస్తే ముందు వెనకా ఆలోచించకుండా ఏ మాత్రం రాకూడదు అంటూ ఏడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. మరి ఇది ప్రమోషన్ లేక ఇతర వీడియోనా అన్నది తెలియాల్సింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: