టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతిని ప్రేమించి వాడుకున్నాడని తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా...టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై కేసు కూడా పెట్టింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది ప్రేయసి లావణ్య.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేసింది ప్రేయసి లావణ్య.  తాము విడిపోవడానికి ఓ సినీ నటే కారణమని.. ఆ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది రాజ్‌ తరుణ్‌ ప్రేయసి లావణ్య.  రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొంది లావణ్య. ఇక ఈ కేసు పెట్టిన అనంతరం మీడియాతో కూడా రాజ్ తరుణ్‌ ప్రేయసి లావణ్య మాట్లాడారు.


11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని వెల్లడించారు లావణ్య. ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని కూడా చెప్పారు. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని సంచలన ఆరోపణలు చేశారు లావణ్య. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని ఆగ్రహించారు లావణ్య.  రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు.

రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలని తెలిపారు లావణ్య. నాకు న్యాయం చేయాలని... గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని ఫైర్‌ అయ్యారు. తాను అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని కూడా పేర్కొంది లావణ్య.  ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదని తెలిపింది. ఇక ఈ కేసుపై పోలీసులు...విచారణ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: