ప్రభాస్  నటించిన భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 8వ రోజు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం రూ. 5.50 కోట్లు షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా కూడా సత్తా చాటింది. వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. 


ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్ రాబట్టి విజయానికి బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చేసింది. 380 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా వచ్చిన ఈ సినిమా ఇంకా కేవలం 17 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇప్పటిదాకా 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా.  హీరో ప్రభాస్ భైరవ పాత్రలో అదరగొట్టారు. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ మెరుపులు మెరిపించారు. ప్రభాస్-అమితాబ్ కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కల్కి మూవీకి హైలెట్ అని చెప్పాలి. ఇక కాంప్లెక్సిటీ ఉన్న పాత్రలో దీపికా పదుకొనె చాలా అద్భుతంగా నటించింది. ఇక కమల్ హాసన్ కనిపించింది తక్కువ సన్నివేశాల్లో అయినా ప్రభావం చూపారు.అయితే కల్కి సినిమా మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కల్కి ఫస్ట్ హాఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. చాలా నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని... మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. అయితే ఈ ప్రశ్నకు నాగ్ అశ్విన్ స్వయంగా సమాధానం చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కల్కి ఫస్ట్ హాఫ్ స్లోగా తెరకెక్కించామని ఆయన అన్నారు..


నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... "నేను చూపించబోయే కొత్త ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేయడానికే ఫస్ట్ హాఫ్ వాడుకున్నాను. ఎందుకంటే ఈ కొత్త ప్రపంచాన్ని, పాత్రలను ఆడియన్స్ అంగీకరిస్తారా లేదా అనే సందేహం మాలో ఉంది. అందులోనూ నలుగురు బడా స్టార్స్ ఈ మూవీలో ఉన్నారు. వారి మార్కెట్, స్టార్డం ఆధారంగా కథను బ్యాలన్స్ చేయాలి.ఫస్ట్ హాఫ్ లో మూడు కొత్త ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలి. ఆడియన్స్ ఎక్కడా గందరగోళానికి గురికాకూడదు. అందుకే రిస్క్ తీసుకోకుండా స్లోగా మొదటి భాగం నడిపించాను... అసలు కథ పార్ట్ 2 లో ఉంటుంది." అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: