త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. 2021 లో ఈ సినిమాను ప్రారంభించగా ఇప్పటివరకు పూర్తి చేయలేదు శంకర్. అయితే కేవలం ఈ సినిమానే కాకుండా మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా షూటింగ్

 కూడా చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్. అలా ఒకేసారి రెండు సినిమాలు షూటింగ్ చేయడంతో రెండు సినిమాల్లో డిలే అవుతూ వస్తున్నాయి. నిజానికి రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా షూటింగ్ మిగిలి ఉండడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈనెల 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దాంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.

 అయితే ఈ సినిమా పూర్తి కావడంతో ఇకనుండి తన పూర్తి రాంచరణ్ తో తీయబోయే సినిమాపై పెట్టబోతున్నట్లుగా తెలిపాడు శంకర్. రీసెంట్ గా భారతీయుడు 2 చిత్రంలో విలన్ గా నటించినా SJ సూర్య ప్రమోషన్స్ లో చెర్రీ ఫాన్స్ కి ఓ మంచి న్యూస్ అందించారు.భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవిలో ప్రధాన విలన్ గా అతనికి అవకాశం రామ్ చరణ్ చిత్రం వల్లే వచ్చింది అన్న విషయాన్ని సూర్యా స్టేజిపై వెల్లడించారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా సూర్య కీలక పాత్ర చేస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను నటించిన కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత శంకర్ అతన్ని భారతీయుడు 2 లో ప్రధాన విలన్ గా చేయమని అడిగారట. అలా రామ్ చరణ్ మూవీ వల్ల అతనికి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ రోల్ దొరికిందని సూర్య వెల్లడించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: