నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రాజకీయం పరంగా వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అటు సినిమాల తోనే కాకుండా ఇటు రాజకీయాల లో కూడా విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో మళ్ళీ బాక్సాఫీస్ షేక్ చేశాడు బాలయ్య. ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు దాదాపుగా 130 కోట్ల గ్రాస్ 80 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు

 పలు థియేటర్స్ లో ఏకంగా 100 రోజులు ఆడింది. అయితే కేవలం థియేటర్స్ లోనే కాకుండా ఓటిటిలో కూడా వచ్చిన భగవంత్ కేసరీ సినిమా ఆమెజాన్ ప్రైమ్ లో ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు హిందీ డబ్బింగ్ వర్షన్  కూడా దాదాపుగా నెల రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదల చేయగా అక్కడ కూడా దుమ్ము దులుపుతోంది. ఇకపోతే ఈనెల రోజులలో దాదాపుగా 50 మిలియన్ వ్యూస్ తో హిందీ ప్రేక్షకుల మనసు దోచుకుంది భగవత్ కేసరి సినిమా. ఇదిలా ఉంటే హిందీ వర్షన్ డబ్బింగ్ స్వయంగా బాలయ్య చెప్పడం

 విశేషం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన ఏజ్ కు తగ్గ పాత్రలో జీవించాడు. ఈ చిత్రంలో నందమూరి నట సింహం ఎలాంటి డ్యూయట్ లేకుండా తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో తనదైన ముద్ర వేసారు. అనిల్ రావిపూడి బాలకృష్ణ వయసుకు దగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల మెచ్చేలా రూపొందించడం విశేషం. 'భగవంత్ కేసరి' మూవీతో నందమూరి నట సింహం పలు రికార్డులను క్రియేట్ చేసారు. టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల్లో వరుసగా ఎవరు వరుసగా మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవరు లేరు. తన తరం కథానాయకుల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ గా రికార్డు క్రియేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: