యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీసిన కల్కి 2898 ఏడి మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా. 


1000 కోట్ల టార్గెట్ కి కాస్త దూరంలో ఉంది ఈ మూవీ. అయితే జులై 12న సౌత్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 థియేటర్స్ లోకి రాబోతోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఈ ఇండియన్ 2 రాబోతోంది. ఈ సినిమా ఎఫెక్ట్ తెలుగు, హిందీ భాషలలో కల్కిపై పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకా అలాగే అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సర్ఫిరా మూవీ కూడా జులై 12న రిలీజ్ కాబోతోంది. సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకి రీమేక్ గా ఈ సర్ఫిరా మూవీ తెరకెక్కింది. పెద్దగా బజ్ లేకపోయిన అక్షయ్ కుమార్ ఇమేజ్ తో ఇంకా మూవీ స్టోరీతో అయిన ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని బిటౌన్ లో వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ కంటే ముందే కల్కి 1000 కోట్లు క్రాస్ చేయాలి. ఒకవేళ ఆ రెండు సినిమాలు ప్లాప్ అయితే కొంచెం లేట్ అయినా కల్కి 1000 కోట్ల మార్క్ అందుకుంటుంది. హిట్ అయితే మాత్రం కల్కికి కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ వీక్ టికెట్ రేట్స్ తగ్గుతాయి. డ్రాప్స్ కూడా పడతాయి. కాబట్టి జులై 12 లోపే కల్కి 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: