టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో డాన్స్ షోలకి జడ్జిగా కూడా వ్యవహరించారు. అయితే గత కొంతకాలంగా జానీ మాస్టర్ కి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జానీ మాస్టర్ కి మెగా కుటుంబం అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నా అమితమైన అభిమానం ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఈ విషయాన్ని తానే స్వయంగా

 చాలా సందర్భాల్లో వెల్లడించాడు. మెగా కుటుంబం పట్ల చాలా గౌరవంగా ప్రవర్తిస్తాడు జానీ మాస్టర్. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడో ఒక సహాయాన్ని గుర్తు పెట్టుకొని మరి జానీ మాస్టర్ కి ఆ సహాయాన్ని చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సరైన సమయంలో సహాయం చేసేవారు దేవుడు అంటూ జానీ మాస్టర్ తాజాగా ఈ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచాడని.. వారికి నాపై ఉన్న ప్రేమకు నేను చాలా సంతోషించాను అంటూ వివరించాడు.

 అక్కడికి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదంతో పాటు.. చరణ్ అన్న, ఉపాసన వదినలు తనకు ఇచ్చిన మాటకి.. వారు ఇచ్చిన సర్ప్రైజ్ కు నాకు సంతోషం కాస్త వెయ్యి రేట్లు పెరిగింది అంటూ జానీ మాస్టర్ వివరించాడు. తను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని తన డ్యాన్సర్ యూనియన్ టి.ఎఫ్, టి.టి.డిఏ లోని 500 పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా చెర్రీ, ఉపాసన జంట అండగా నిలబడతామని మాటిచ్చారట. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మరి మాటకి విలువ ఇస్తూ అన్ని కుటుంబాలను చేరదీయడం సాధారణ విషయం కాదని.. చరణ్, ఉపాసనలపై ప్రశంసల వర్షం కురిపించాడు జానీ మాస్టర్. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: