టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.అంతేకాకుండా రాజ్ తరుణో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. కానీ అంతకుముందే తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది.రాజ్ తరుణ్ నా ప్రపంచం.. నాకు కావాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో పోలీసులు తాజాగా స్పందించారు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య తమకు ఫిర్యాదు చేసిందని నార్సింగ్ ఇన్ స్పెక్టర్ వెల్లడించారు. రాజ్ తరుణ్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని, తనని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్టు సమాచారం.

తాజాగా ఈ విషయం పై హీరో రాజ్ తరుణ్ స్పందిస్తూలావణ్యను నేను మోసం చేయ‌లేదు. తానే నన్ను మోసం చేసిందంటూ రాజ్ త‌రుణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసొందే. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను మీడియా ముందు రాజ్ త‌రుణ్ వెల్ల‌డించాడు.తాను హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు మొద‌ట‌ స‌హ‌యం చేసింది లావణ్యనే. అందుకే తాను నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా త‌ట్టుకున్నాను.ఎప్పుడైతే లావ‌ణ్య డ్ర‌గ్స్ తీసుకోవ‌డం మొద‌లుపెట్టిందో అప్పుడే త‌న లిమిట్స్ త‌ను దాటిపోయింది. నేను సిగ‌రెట్ మద్యం తీసుకుంటాను కానీ డ‌గ్స్ ఎప్పుడు తీసుకోలేదు. లావ‌ణ్య‌కు నా డ‌బ్బులు కావాలి అందుకే ఇలాంటి స్టోరీలు అల్లుతుంది. మ‌స్తాన్ సాయి అనే వ్య‌క్తితో లావ‌ణ్య‌కు రిలేష‌న్ ఉంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నారు. లావ‌ణ్య‌తో నేను 2017 నుంచి దూరంగా ఉంటున్నాను. లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు. నా ప‌రువు పోతుంద‌నే ఇన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్నాను. లావ‌ణ్య మోసం చేసింది కాబ‌ట్టే మ‌స్తాన్ సాయి ఆమెపై కేసు పెట్టాడు.న‌టి మాల్వి మల్హోత్రాపై లావ‌ణ్య చేస్తున్న వార్త‌లు ఆవాస్త‌వం. మాల్వి మల్హోత్రా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాల్వి మల్హోత్రా నేను క‌లిసి తిర‌గ‌బ‌డ‌రా సామీ అనే సినిమాలో న‌టించాం. ఆ సినిమా వ‌ర‌కే మా రిలేష‌న్. లావ‌ణ్య కావాల‌ని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంది అంటున్నారు రాజ్ తరుణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: