ఇప్పుడు సినిమాలు తీసే ట్రెండ్ మాత్రమే కాదు సినిమాలు వసూళ్లు చేసే కలెక్షన్స్ ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వంద రోజులు 365 రోజులు ఇలా ఆడింది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కి అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా హిట్ ఫట్టా అన్న విషయం కేవలం వారం రోజుల్లోనే తేలిపోతుంది. వారం రోజుల్లో వచ్చిన ఆ మూవీ కలెక్షన్స్ ని బట్టి ఆ సినిమా సూపర్ హిట్, ఆ బ్లాక్ బస్టర్, యావరేజ్ అన్న విషయాన్ని తేల్చేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ భారీగానే వసూళ్లు సాధిస్తున్నాయి.


 అయితే నేటి రోజుల్లో మొదటి రోజు భారీ బడ్జెట్ సినిమా ఎన్ని వసూళ్లు సాధిస్తుంది అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో త్రిబుల్ ఆర్ సినిమా మొదటి ప్లేస్ లో ఉంది. ఏకంగా 223 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక తర్వాత ప్లేస్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కిన బాహుబలి 2 సినిమా ఉంది. 212 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో ప్లేస్ లో  ప్రభాస్ హీరోగా నటించిన కల్కి నిలిచింది. మొదటి రోజు 191 కోట్ల వసూళ్లు రాబట్టింది.


 అయితే భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన కల్కి సినిమా త్రిబుల్ ఆర్, బాహుబలి 2 మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులను ఎందుకు బ్రేక్ చేయలేదు అన్నది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న. అయితే ఈ రికార్డులను కల్కి మూవీ ఈజీగా బ్రేక్ చేసేదే. కానీ ఈ సినిమాకి మొదటి రోజు నైట్ ఒంటిగటకు వేయాల్సిన బెనిఫిట్ షోస్ వెయ్యలేదు. దానివల్ల ఈ సినిమా కలెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గాయి అనే టాక్ ఉంది. అలాకు వేయకపోవడానికి కారణం ఏంటంటే నైట్ ఒంటిగంటకు సినిమా అంటే చాలామంది తాగేసి సినిమా థియేటర్కు వచ్చి అల్లరి అల్లరి చేస్తారు. ఆ సమయంలో సినిమా చూసే లేడీస్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో షూస్ ని క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక షో కనక పడినట్లయితే ఈ సినిమా అన్ని రికార్డులను తుడిచి పెట్టేది అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: