మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్ రాధిక గురించి కూడా చెప్పనక్కర్లేదు. భార్యాభర్తలు విడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు సెలెబ్స్ మొదటి భర్తతో విడిపోయి రెండో వివాహం చేసుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే..వీరికి ఇద్దరు భర్తలతో పిల్లలు ఉన్నారు. రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు భర్తలతో సంతానం కలిగిన చత్ర ప్రముఖులు ఎవరో చూద్దాం. భారతీయ సంస్కృతిలో పెళ్లి అత్యంత పవిత్ర కార్యం. ఓ అమ్మాయి అబ్బాయిని జత చేసే తంతు. పెళ్లి అనేది నూరేళ్ల బంధం. నాతి చరామి అంటూ కడవ వరకు కలిసి ఉంటామని అందరి ముందు చేసుకునే ఒప్పందం. అయితే అందరి విషయంలో ఈ ప్రమాణాలు ఫలించవు. భార్యాభర్తలు విడిపోవడానికి ఒక చిన్న కారణం చాలు. ఇద్దరి మధ్య అవగాహన కుదరకున్నా, అభిప్రాయ భేదాలు తలెత్తినా విడాకులు ఖాయం. ఒకప్పటి సమాజంలో సర్దుకుపోవడం అని కాన్సెప్ట్ గట్టిగా పనిచేసేది. సమాజంలో నవ్వుల పాలవుతామని కష్టమైనా ఇష్టంతో కలిసి ఉండేవారు. మోడరన్ డేస్ లో విడాకులు జస్ట్ నథింగ్.


చిన్న చిన్న కారణాలతో విడిపోయే జంటలు అనేకం. కాగా కొందరు సెలబ్రిటీలు రెండు పెళ్లిళ్లు చేసుకుని..0ఇద్దరూ భర్తలతో పిల్లలతో కలిసి ఉంటారు వారు ఎవరో చూద్దాం. 80-90 లలో రాధిక స్టార్ హీరోయిన్. రెండు జనరేషన్ స్టార్స్ తో రాధిక నటించారు. ప్రస్తుతం రాధిక క్యారెక్టర్ ఆర్టిస్టగా కొనసాగుతున్నారు. ఆమె నిర్మాత కూడాను. పలు చిత్రాలను సొంత బ్యానర్ లో నిర్మించారు. అలాగే రాజకీయ ప్రవేశం కూడా చేశారు. నటి రాధిక 1985 లో ప్రతాప్ పోతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో రాధికకు ఏడాది వ్యవధిలో డివోర్స్ అయ్యాయి. అనంతరం 2001లో నటుడు శరత్ కుమార్ నీ మరో వివాహం చేసుకున్నారు. వీరికి రోహిత్ అనే అబ్బాయి ఉన్నాడు. మొదటి భర్తతో ఆమెకు మరొక కొడుకు ఉన్నట్లు సమాచారం. ఇక వరలక్ష్మి నటుడు శరత్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన అమ్మాయి. మెగాస్టార్ శ్రీజ చిన్న కూమారై శ్రీజ రెండు వివాహాలు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో శ్రీజ తన క్లాస్ మేట్ శిరీష్ భరద్వాజ్ నీ రహస్య వివాహం చేసుకున్నారు. 2007 లో ఆర్య సమాజ్ లో శ్రీజ-శిరీష్ వివాహం జరిగింది. 2011లో వీరు విడిపోయారు. వీరికి నివ్రితి అనే అమ్మాయి పుట్టింది.


మొదటి భర్తతో విడాకులు తర్వాత 2016 లో నటుడు కళ్యాణ్ దేవుని రెండో వివాహం చేసుకుంది. వీరికి 2018లో నవిష్క అనే అమ్మాయి పుట్టింది. శ్రీజ-కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. వీరు విడాకులు తీసుకున్నారని టాలీవుడ్ టాక్. ఇద్దరూ కుమార్తెలు శ్రీజ వద్దే పెరుగుతున్నారు. శ్రీజ మొదటి భర్త శిరీష్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఆమె నిర్మాత, దర్శకురాలు, గ్రాఫిక్ డిజైనర్. కొచ్చిడయాన్, విఐడి 2 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. కాదా సౌందర్యకు రెండు వివాహాలు జరిగాయి. 2010లో ఆమె అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి 2017 లో విడాకులు అయ్యాయి. వీరికి వేద అనే అబ్బాయి ఉన్నాడు. ఇక రెండో వివాహంగా విశాగన్ అనే వ్యక్తిని చేసుకున్నారు. రెండవ భర్త విశాగన్ తో ఆమెకు మరొక అబ్బాయి పుట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: