రానా దగ్గుపాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో రాణిస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నారు. 35 చిన్న కథ కాదు సినిమా స్టోరీ విండే తనకోసం వాళ్ళ అమ్మ పడిన కష్టమే గుర్తుకు వచ్చిందని రానా దగ్గుపాటి చెప్పారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఎజ్ క్లీన్ ఎంటర్ డైనర్ మూవీ "35 చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ బరిజినల్స్ , వాల్టెయిర్ ప్రొడక్షన్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యర బోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.


ఈ మూవీకి నంద కిషోర్ ఈ మాని కదా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా 35 చిన్న కథ కాదు మూవీ టీజర్ ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. గురువారం 35 సినిమా టీజర్ విడుదల చేస్తూ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత రానా దగ్గుపాటి ఇండ్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. "స్కూల్ లో ఉన్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటిది. నందు ఈ కథ చెప్పినప్పుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నాకోసం మా అమ్మ పడినా కష్టం గుర్తుకు వచ్చింది.


ఈ కథ వెళ్ల మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. చాలామంది లైఫ్ ఇలా ఉంటుంది. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు" అని రానా దగ్గుబాటి చెప్పారు. "చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి ప్యూర్ హర్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్ లో చేయాలనేది మా ఉద్దేశం. విశ్వ.. పరేషాన్ సినిమాతో వచ్చారు. సినిమాల పట్ల తనకి చాలా పాషన్ ఉంది. నివేదాకి కథ నచ్చితే ఆ కథతోనే ఉంటుంది. ప్రోడక్ట్ అద్భుతంగా రావడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. తను ఈ సినిమాలో పార్ట్ కావటం చాలా ఆనందంగా ఉంది" అని రానా దగ్గుబాటి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: