ఈ సినిమాపై భార్య అంచనాలు ఉన్నాయి. అయితే చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ మరొకసారి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వీటికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్ట్రాంగ కౌంటర్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఆగిపోనుందంటూ ఎక్స్ లో ఒకరు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరకు చేరింది. సదరు వ్యక్తికి హరిశ్ స్ట్రాంగ్ రిప్లైయ్ ఇచ్చారు. 'సినిమా మొదలే కాదు అని రూమర్స్ వచ్చినప్పుడే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి రూమర్స్ గురించి చదివే సమయం నాకు లేదు' అని హరీశ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ స్పష్టం గా చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని శిరీశ్ శంకర్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీ లీల కథానాయకగా నటిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్మిస్తున్నారు. సమయం దొరికినప్పుడు ఘాటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సహా ఓ జీ, హరిహర వీరమల్లు సినిమాలు పవన్ పూర్తి చేయాల్సి ఉంది.