దీనిపై చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం స్పందించలేదు కూడా. ఇక ఈ మూవీ కోసం ఇండోనేషియా నుంచి చెస్లా అనే హీరోయిన్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. దాదాపు కథను అండ్ కథనాలను ఫిక్స్ చేశాడట జక్కన్న . ఇక ఇప్పుడు ఈ మూవీలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. చిన్న పాత్ర అయినా అందులో స్టార్డం ని మిక్స్ చేయడానికి రాజమౌళి ఇష్టపడతాడు . విలన్ పాత్ర కోసం కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు.
ఇప్పుడు ఆయన దృష్టి విక్రంపై పడింది . జక్కన్న నుంచి ఆఫర్ రాగానే ఎంత పెద్ద స్టార్ అయినా ఒప్పుకోవాల్సిందే . ఆయన స్థాయి అలాంటిది మరి . విక్రమ్ ఈ ఆఫర్కు నో చెప్పే అవకాశం లేదు . సో మహేష్ కు విలన్ గా విక్రమ్ దాదాపుగా సెట్ అయిపోయినట్లే . ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనుంది . 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . ఈలోగా మహేష్ మరో సినిమా చెయ్యడు . కనీసం కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించడు . మహేష్ లుక్ రివిల్ కాకూడదన్న ఉద్దేశంతోనే జక్కన్న ఈ కండిషన్ విధించినట్లు తెలుస్తుంది. ఏదేమైనాప్పటికీ జక్కన్న సినిమాపై మంచి కసర అప్పులు చేస్తున్నాడు .