అయితే రీసెంట్ గా విశ్వక్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశాడు. ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు ఇలా చేశాడు అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇక ఈ క్రమంలో తన అభిమానులకి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ యంగ్ హీరో. " గత కొద్ది రోజులుగా నా instagram అకౌంట్ ను ఎందుకు? డియాక్టివేట్ చేశాను అని అభిమానుల నుంచి వరుసగా మెసేజ్లు వచ్చాయి. నేను కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏదో హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం లేదు.
ఇందులో భాగంగా నా ఇంస్టాగ్రామ్ ను డియాక్టీవేట్ చేశాను. నా ట్విట్టర్ హ్యాండిల్ ని కూడా నా టీం మేనేజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాదు . అందుకే ఈ సోషల్ మీడియాను కొంతవరకే సీరియస్ గా తీసుకోండి . నేను నా నెక్స్ట్ మూవీ రిలీజ్ తరువాత తిరిగి సోషల్ మీడియాలోకి రావచ్చు . రాకపోవచ్చు " అంటూ విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చాడు . ప్రజెంట్ విశ్వక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఏదేమైనాప్పటికీ విశ్వక్సేన్ పెద్ద డెసిషన్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు .