ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రం చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కెరియర్ ను ముందుకు సాగిస్తుంటారు. కానీ అలా కెరియర్ను సాగించిన వారిలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కాకుండానే కెరియర్ను క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది మంచి అవకాశాలు దక్కుతున్న స్టార్ హీరోల సినిమాలలో మాత్రం అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వెనకబడిపోతూ ఉంటారు. అలాంటి వారిలో రాశి ఖన్నా ఒకరు. ఈమె ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగులో ఎప్పుడూ కూడా పెద్దగా ఖాళీ లేకుండా సినిమా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. అలాగే ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు విజయాలను సాధించాయి. ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ కూడా వస్తుంది. ఇలా ఎన్నో క్వాలిటీస్ ఉన్నా కూడా ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు మాత్రం పెద్దగా దక్కడం లేదు. ఇప్పటి వరకు తన కెరీర్ మొత్తంలో ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జై లవకుశ లో తప్ప మరో తెలుగు స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.

ఇకపోతే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇందులో కూడా ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నిజానికి రాశి కన్నాకు స్టార్ హీరోల పక్కన అవకాశాలు కనుక వరుసగా దక్కి ఉన్నట్లు అయితే ఈమె తెలుగులో ఎప్పుడో అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళేది. ఈమెకు స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాకపోవడం వల్లే ఇప్పటికీ కూడా మీడియం రేంజ్ హీరోయిన్గా మిగిలిపోయింది. ఏదేమైనా ఈమె మాత్రం ఎప్పుడూ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగానే కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: