కమల్ హాసన్ తాజాగా భారతీయుడు 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఈ సినిమా ఇండియన్ అనే పేరుతో తమిళ్ లో రూపొంది మంచి విజయం సాధించింది. దానితో ఈ సినిమాను తమిళ్ లో ఇండియన్ 2 అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి ఇండియాలోనే గొప్ప గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమాని జూలై 12 వ తేదీన వరల్డ్ వైడ్ గా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. ఇక ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను తెలుగు లో కూడా ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా హైదరాబాదు లో ఓ భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 7 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎం కన్వెన్షన్స్ , హైదరాబాదులో నిర్వహించనున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే భారతీయుడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో భారతీయుడు 2 పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్లను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిర్వహించినట్లు అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ మూవీ బృందం ప్రమోషన్లతో ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలను పెంచగలుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: