విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో అంజలి చేసిన పాత్రకు బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అంజలిని ఇలా ఎప్పుడు చూడలేదని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఐతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరోసారి వేశ్య పాత్రలో అంజలి నటిస్తుంది. ఐతే ఈసారి సినిమా కోసం కాదు వెబ్ సీరీస్ కోసమని తెలుస్తుంది.
అంజలి లీడ్ రోల్ లో బహిష్కరణ అనే సినిమా వస్తుంది. ఈ సీరీస్ ను ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అంజలి వేశ్యగా నటిస్తుంది. సీరీస్ కు సంబందించిన పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. మరి ఈ సీరీస్ లో అంజలి ఎలా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. ఐతే అంజలి ఒకప్పుడు హోంలీ పాత్రలు చేస్తూ అలరించేది ఇప్పుడు ఆమెకు వేశ్య పాత్రలు ఇస్తూ వస్తున్నారు.కాస్త విరామం తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుంది అంజలి. తనకు తగ్గట్టుగా మంచి పాత్రలను ఎంచుకుని మరీ నటిస్తోంది. ఈక్రమంలో దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తోంది బ్యూటీ.