అయితే ఆ వెంటనే ఈ జంట హాస్పిటల్ కు వెళ్ళింది. దీంతో సోనాక్షి అప్పుడే ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిపై తాజాగా టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది సోనాక్షి. ఈమె మాట్లాడుతూ.." జీవితం ఇంతకంటే గొప్పగా ఉండదు . నా పెళ్ళిలో విశేషం ఏమిటంటే జీవితంలో పెద్ద మారుపేమి రాలేదు . పెళ్లికి ముందు కూడా నా జీవితం ఎంతో బాగుండేది . ఇప్పుడు మళ్లీ అందులోకే తిరిగి వచ్చాను. మళ్లీ షూటింగ్ లు మొదలుపెట్టడం సంతోషంగా ఉంది .
ఒకే ఒక్క మార్పు ఏంటంటే .. ఇప్పటి నుంచి మేము హాస్పిటల్ కి వెళ్ళలేము. ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలు నేను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటున్నారు " అంటూ సోనాక్షి ఫన్నీగా రియాక్ట్ అయింది . ప్రెసెంట్ సోనాక్షి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సోనాక్షి సిన్హా, జహీర్ ఏడేళ్ల డేటింగ్ తరువాత జూన్ 23వ తారీఖున పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముస్లింను పెళ్లి చేసుకోవడంపై కూడా సోనాక్షి పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ప్రేమే పెద్ద మతం అంటూ ఆ ట్రోలింగ్‌ను ఆమె తిప్పి కొట్టింది. జహీర్ కూడా ఓ నటుడే. సోనాక్షి తో కలిసి అతడు డబుల్ ఎక్సెఎల్ మూవీలో నటించాడు.