కల్కి మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు . ఈ చిత్రంలోని సీన్లు మ్యాడ్ మ్యాక్స్ , డ్యూన్ లాంటి సినిమాల నుంచి కాపీ చేసినట్లుగా ఉన్నాయన్న విమర్శలపైన స్పందించారు నాగశ్విని. అయితే విజువల్స్ అలా కనిపించాయి తప్ప వాటితో తమ సినిమా స్టోరీకి ఎటువంటి సంబంధం లేదని పిటిఐ కి ఇచ్చినా ఇంటర్వ్యూలో అతడు స్పష్టం చేయడం జరిగింది . కల్కి మూవీ ని హాలీవుడ్ స్థాయిలో 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన సంగతి తెలిసిందే .


సినిమా ఎంతో మందికి నచ్చింది కూడా . బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది . అయితే ఈ సినిమాలోని విజువల్స్ అన్ని హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల నుంచి కాపీ కొట్టినట్లు పలువురు ట్రోల్స్ చేశారు . ఇక దీనికి తాజాగా పి టి ఐ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ స్పందించారు . " నాకు స్టార్ వార్స్ అంటే ఇష్టం . అది తెలియకుండానే నాపై ప్రభావం చూపించింది. మిగతా సినిమాల ప్రభావం అంతగా లేదు. కేవలం ఎడారి విజువల్స్ తప్ప . అవి డ్యూన్, మ్యాడ్ మ్యాక్స్ లలోను ఎడారి ఉంది .


అది తప్ప దాంతో మా స్టోరీ అండ్ టెక్నాలజీ లేదా డిజైన్ కి ఎటువంటి సంబంధం లేదు . సరదాగా అనిపించి రోబో సైడ్ కిక్ బహుశా స్టార్ వార్స్ లాంటిది . అంతేకాదు వాహనాలు పాతవిగా కనిపించడానికి కాస్త తుప్పు పట్టినట్లుగా చూపించడం కూడా దాని నుంచే కావచ్చు " అంటూ నాక్ అశ్విన్ తెలియజేసాడు . ప్రెసెంట్ నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నాగ్ అశ్విన్ వ్యాఖ్యలను చూసిన పరుగురూ పలు రకాలుగా స్పందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: