యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మొదటి భాగంలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని చాలా రోజుల క్రితం ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు ప్రకటించారు.

ఇక్కడ వరకు అంతా బాగుంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు మూవీల విడుదల తేదీల దగ్గరికి ఎవరూ రాలేదు. అనూహ్యంగా ఈ రెండు సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజి మూవీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారో చెప్పలేదు కానీ సెప్టెంబర్ 27 వ తేదీన మాత్రం ఈ మూవీ ని విడుదల చేయడం కష్టం అని అందరికీ అర్థం అయిపోయింది. దానితో మొదటగా నిర్మాత సూర్య దేవర నాగ వంశీ అలర్ట్ అయ్యాడు. తాను ప్రస్తుతం నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఇక అక్కడి వరకు బాగానే ఉంది.. మళ్లీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఎదురయింది. దేవర మూవీ కి సంబంధించిన పనులు అనుకున్న తేదీ కంటే ముందే కానున్న నేపథ్యంలో అక్టోబర్ 10 కంటే సెప్టెంబర్ 27 వ తేదీ మంచిది అనుకున్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీకి ఫ్రీ ఫోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో లక్కీ భాస్కర్ మూవీ కి మళ్ళీ సమస్య ఎదురయింది. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కావడం కష్టమే, ఎన్టీఆర్ కి పోటీగా ఈ మూవీ రాదు అనే అభిప్రాయాలు జనాల్లో రేకెత్తాయి. ఇక ప్రస్తుతం అందుకు తగిన సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: