ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మేనియానే నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.  మొదటి రోజు నుంచి వసూళ్లలో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న కల్కి  మూవీ ఇప్పటికే 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో ఏ పెద్ద సినిమా విడుదలకు సిద్ధంగా లేకపోయినా నేపథ్యంలో ఫుల్ రన్ పూర్తయ్యేసరికి కల్కి సినిమా మరిన్ని రికార్డులను తుడిచి పెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.


 అయితే కేవలం విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే కల్కి సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది అని చెప్పాలి. ఇప్పుడు మాత్రమే కాదు రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమా రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ఇప్పటివరకు కల్కి సినిమా అమెరికాలో 14.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం 115 కోట్ల రూపాయలు అమెరికాలోనే వసూలు చేసింది కల్కి మూవీ  మామూలుగానే అమెరికాలో తెలుగు సినిమాలకు మార్కెట్ ఎక్కువ  అక్కడ వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధిస్తేనే గొప్పగా చెప్పుకుంటారు.


 కానీ ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాలు అమెరికాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాలలో 20 మిలియన్ డాలర్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా 14.3 డాలర్స్ తో రెండో ప్లేస్ లో ఉండేది. కానీ ఇప్పుడు కల్కి సినిమా త్రిబుల్ ఆర్ రికార్డును తుడిచి పెట్టేసింది  ఇటీవల అమెరికాలో 14.5 మిలియన్ డాలర్స్ వసూలు సాధించి.. రెండో ప్లేసులోకి వచ్చేసింది. ప్రస్తుతం కల్కి మూవీకి ఏర్పడుతున్న బజ్ చూస్తే రానున్న రోజుల్లో బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: